Thursday, May 12, 2011

ఆ పక్షులు

చుట్టుకుంటోంది చేయి 
వలయమై 

అలుముకుంటోంది ఊపిరి
నునువెచ్చని మంటై

ఎగిసిపడుతోంది ఛాతి
అలలై

పర/వశమైపోతోంది. ఆదిమ
నీడల ప్రాగణంలోకి

శరీరం చేజారిపోతోంది. 
మృత్యుమోహితమై
దిగంతాలలోకి

నయనం ఇంకిపోతోంది:

=ఇక పక్షులు, నిన్ను 
వొదిలివెళ్ళిన ఆ పక్షులు 
గూటిని చేరే సమయం 

ఆసన్నమయ్యింది:

లేచి దీపం వెలిగించు=